![]() |
![]() |

వెండితెరపై నటించే హీరోలకే కాదు.. బుల్లితెర హీరో, హీరోయిన్లకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. అందులోను స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ కి మరీను. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లలోని బ్రహ్మముడి, గుప్పెడంత మనసు సీరియల్ లకి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే వాటి కంటెంట్ అలా ఉంటుంది మరి.
గుప్పెడంత మనసు సీరియల్ లో మొదట వసుధార, రిషిల లవ్ స్టోరీకి చాలా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎంతలా అంటే ఆ సీరియల్ టైమ్ స్లాట్ కోసం ఎదురుచూసేంత.. అందరికి చేరువైన ఈ సీరియల్ లో ఎన్నో మార్పులు జరిగాయి. మొదట కాలేజీలో రిషి, ఫణింద్ర, జగతి, మహేంద్ర, వసుధార ఉండేవారు. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్ ల తర్వాత విలన్ శైలేంద్ర ఎంట్రీ ఇచ్చాడు. అలా అతడికి డీబీఎస్టీ కాలేజీ ఎండీ సీటు మీద ఉన్న మక్కువతో తనకి అడ్డుగా ఉన్న జగతిని చంపేశాడు శైలేంద్ర. ఆ తర్వాత రిషిని అడ్డుతొలగించాలనుకున్నాడు. కానీ అప్పుడే కథలోకి ఏంజిల్ వచ్చింది. కొన్ని రోజులు రిషి అజ్ఞాతంగా ఏంజిల్ దగ్గర ఉండగా వసుధార వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చింది. ఇక రిషి వాళ్ళ నాన్న మహేంద్ర ఎమోషనల్ గా మారి మద్యానికి బానిసగా మారగా .. అతడిని మార్చడం కోసం రిషి, వసుధార కలిసి ఊటికి తీసుకెళ్ళారు. అక్కడ అనుపమ ఎంట్రీ ఇచ్చింది. అలా కథలోకి కొత్త పాత్రలు వస్తూనే ఉన్నాయి.
ఊటిలో వసుధార, రిషి, మహేంద్ర, ఉండగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి శైలేంద్రే దోషి అని చెప్పాడు. ఇక అదే సమయంలో రిషి కన్పించకయండా పోయాడు. ఇక మళ్ళీ కొన్ని ఎపిసోడ్ ల తర్వాత అడవిలో ఇద్దరు ముసలివాళ్ళకి రిషి దొరికినట్టు చూపించారు. ఇక అంతా ఓకే అనుకున్న సమయంలో కాలేజీ యూత్ ఫెస్టివల్ కోసం రిషిని వసుధార వాళ్ళ నాన్న చక్రపాణి తోసుకొస్తుండగా కొందరు దుండగులు చక్రపాణి తలపై కొట్టి రిషిని తీసుకెళ్ళినట్టు చూపించారు. ఇక అక్కడి నుండి రిషి చనిపోయాడంటూ కొన్ని ఆధారలని చూపించారు. కానీ వసుధార నమ్మలేదు. అదే సమయంలో మను ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజా ఎపిసోడ్ లో రిషిని తీసుకొస్తానంటూ తనకి మూడు నెలల గడువు కావాలంటు వసుధార చెప్పింది. అంటే మరికొన్ని ఎపిసోడ్ ల తర్వాత గుప్పెడంత మనసులోకి మళ్ళీ రిషి వస్తున్నాడన్న మాట.
తాజాగా రిషి అలియాస్ ముఖేష్ గౌడ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో 'బ్రహ్మముడి' కళ్యాణ్ తో తనకున్న స్నేహం గురించి ఓ పోస్ట్ పెట్టాడు. తనకున్న ఆరోగ్య సమస్య తీరినట్టుగా అనిపిస్తుంది. దీంతో మరికొన్ని రోజుల్లో రిషి తన అభిమానులకి తీపికబురు చెప్పబోతున్నాడన్న మాట. ఇప్పటివరకు స్టార్ మాటీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసుని ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసిన వాళ్ళు ఎంతమంది? రిషి రాకకోసం చూసేవాళ్ళెంత మంది కామెంట్ చేయండి.
![]() |
![]() |